ఆత్మగౌరవ యుద్ధ కవిత కందిలి

(గుర్రం సీతారాములు) “మహా కవుల మరణ యుద్ధ కవిత” పేరుతో మార్చి 2 వార్త ఆదివారం అనుబంధంలో “దళిత కవులు ఇంకా బ్రతికే ఉన్నా దళిత కవిత్వం మాత్రం మరణించిందని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదని ‘కందిలి’ లాంటి కవితా సంకలనాలు రుజువు పరుస్తాయి” అన్న తీవ్రమైన వ్యాఖ్యలకు సమాధానం ఇది. గత రెండు దశాబ్దాలుగా సమకాలీన సాహిత్య వాద వివాదాలను సమీక్ష, విమర్శకుల అభిప్రాయాలను శ్రద్ధగా గమనిస్తున్న నా పరిమిత జ్ఞానంతో ఇది రాస్తున్నాను. ఇంతగా [...]

కుందేలు పెంపకం

ప్రయోజనాలు • హెచ్చు పునరుత్పత్తి రేటు - ఏడాదికి 4 సార్లు(గర్భధారణ సమయం 30-32 రోజులు) మాత్రమే. • హెచ్చు దాణా మార్పిడి నిష్పత్తి. వంటింటి ఉద్యానవనాలనించి మార్కెట్కు సులభంగా చేరవేయవచ్చు. • తక్కువ స్థాయి కొలెస్ట్రాల్ గల మాంసం • కుందేలు బొచ్చు(ఉన్ని)కు మంచి మార్కెట్ ధర ఉంది. జాతులు ప్రసిద్ధమైన జాతులివి : • అంగోరా – మాంసం కన్నా  బొచ్చుకే(ఉన్ని) ప్రాధాన్యత • న్యూజిలాండ్ వైట్ – మాంసం,  బొచ్చు(ఉన్ని) • గ్రే జైంట్ – మాంసం,  బొచ్చు(ఉన్ని) • వైట్ జైంట్ – మాంసం [...]

భారత్లో బర్డ్‌ఫ్లూ!

మనుష్యుల్లాగే పక్షులకూ  ఫ్లూ వస్తుంది. దీన్నే ఏవియన్ ఫ్లూ, ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అనీ అంటారు.  ఐ5కే1అనే వైరస్ పక్షులకు, కోళ్లకూ బాతులకూ కూడా సోకుతుంది. పక్షులకు సోకే సాధారణ వైరస్లు కేవలం ఇతర పక్షులకు మాత్రమే సోకుతాయి. ఐతే, ఈ బర్డ్ఫ్లూ మాత్రం పక్షులనుంచి మనుష్యులకు సోకే ప్రమాదం ఉంది. అలాటి ఒక మనిషికి ఐ5కే1 వైరస్ సోకిన కేసు 1997లో తొలిసారిగా హాంగ్కాంగ్లో బైట పడింది. ఆ తర్వాత ఈ వైరస్ ఆసియా, ఆఫ్రికా, యూరప్ [...]

ఆవులు – జాతులు – వాటి ఎంపిక

పాడి ఆవులు సాహివాల్ ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్,ఢిల్లీ, బీహార్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో ఉంటుంది. పాల దిగుబడి- గ్రామీణ ప్రాంతాలలో :1350 కిలోలు – వాణిజ్య డైరీ ఫారంలో: కిలోలు మొదటిసారి ఈతకు వచ్చినవపుడు వయసు -32-36 నెలలు ఈతకు, ఈతకు మధ్య సమయం 15 నెలలు గిర్ దక్షిణ కలైవార్ ప్రాంతాలలోని గిర్ అడవులలో ఉంటుంది. పాల దిగుబడి- గ్రామీణ ప్రాంతాలలో- 900 కిలోలు – వాణిజ్య డైరీ ఫారంలో -1600 కిలోలు [...]

వ్యవసాయం ద్వారా జీవనోపాధి

గ్రామీణ భారతంలో జీవనోపాధినిచ్చేది నిస్సందేహంగా వ్యవసాయమే (తత్సంబంధ శాఖలతో సహా). మనం ఎలక్ట్రానిక్ కాలంలోకి అడుగుపెట్టాం. దానికి తోడు కొత్త కల్పనలు, ఆవిష్కారాలూ ఎన్నో వస్తున్నాయి. దీనికి వ్యవసాయ రంగం అతీతమైనదేమీ కాదు. అందువల్ల వ్యవసాదారులందరికీ ఈ వ్యవసాయ రంగంలో వస్తున్న ­వినూత్న మార్పుల గురించి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెరుగైన పరిజ్ఞానం గురించి ఉపయుక్తమైన సమాచారాన్ని గ్రామీణ భారతంలోని రైతులోకానికీ, మరియు రైతు సేవ అందించే వారికీ తెలియాలి. అలా అందుబాటులోకి తేవడమే www.indg.in [...]

విద్య- ఉత్తమ పద్థతులు

హిమాయత్నగర్: ప్రాథమికోన్నతపాఠశాలల విద్యార్థుల్లో భాషాప్రావీణ్యాన్నిమెరుగుపరచడం, పఠనాసక్తిపెంచడానికిసర్వశిక్షా అభియాన్ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఇవి అమలవుతున్నతీరును పరిశీలించేందుకు బుధవారం నగరం, రంగారెడ్డిలలోనికొన్నిస్కూళ్లను రాష్ట్రవిద్యాపర్యవేక్షణ అధికారి ఉపేందర్రెడ్డి, స్టేట్కమ్యూనిటీమొబిలైజేషన్ఆఫీసర్ మధుసూధన్, రంగారెడ్డి జిల్లాలసర్వశిక్షా అభియాన్అధికారి జయనాథరావుతదితరులు సందర్శించారు. మొదటబోయిన్పల్లిలోని జి.జి.యు.పి.ఎస్.పాఠశాలకు వెళ్లిఅక్కడ విద్యార్థులను ఈకార్యక్రమాల వల్ల కలుగుతున్న ప్రయోజనాలనుఅడిగితెలుసుకున్నారు.అనంతరం కుత్బుల్లాపూర్లోనిడి.పి.ఇ.పి.స్కూలును, గాంధీనగర్లోని మండల పరిషత్ ప్రాథమికపాఠశాలను కూడా సందర్శించారు. సమాజాలకు విద్యనందించడం, సమాయాత్తం చేయడం ఇండియాలో కార్మికుల్లా పనిచేసే బాలికలకోసం ఒక విశిష్టమైన పద్ధతిని ఎంవి ఫౌండేషన్ తయారుచేసింది : సమాజాలను, [...]

బాలికా విద్య

అందరికీ విద్య అందించాలనేది భారత ప్రభుత్వ దృఢ సంకల్పం. ఐతే మొత్తం ఆసియాలోకే అతి తక్కువ మహిళా అక్షరాస్యత భారత దేశంలోనే ఉంది. 1991లో 330 మిలియన్ల 7 ఏళ్ల వయస్సుపైబడినమహిళా జనాభాలో దాదాపు 40శాతంకన్నా తక్కువమంది అక్షరాస్యులు. అంటే, నేటికి ఇండియాలో కనీసం 200 మిలియన్ల స్త్రీలు నిరక్షరాస్యులన్నమాట. ఈ అతి తక్కువ అక్షరాస్యత స్థాయి కేవలం మహిళల జీవనంపైనే కాదు, వారి కుటుంబ జీవనంపైన కూడా వ్యతిరేక ప్రభావాన్ని చూపుతోంది. ఆ ప్రభావం దేశ [...]

బాలల హక్కులు

భారదేశంలో గల 30 కోట్ల  పిల్లలలో చాలామంది పిల్లలు శారీరకంగా మానసికంగా ఎదుగుదల లోపించి ఉంటున్నారు.  ఆర్ధిక, సామాజిక స్ధితిగతుల కారణంగా ఈ అభివృద్ధి లోపం ఏర్పడుతున్నమాట వాస్తవం. రేపటి జ్ఞానవంతమైన శక్తిమంతమైన భారతదేశాన్ని చూడడానికి నేటి బాలల అవసరాలను తీర్చే సమయమాసన్నమైనది. భారతదేశ  స్వాతంత్ర్యనంతర శకంలో నిశ్చతమైన నిబద్ధతతో కూడిన భారతదేశ రాజ్యాంగ విహిత చట్టనిబంధనల ద్వారా బాలల కొరకు అవకాశాలను, కార్యాచరణ విధానాలను మరియు కార్యక్రమాలను రూపొందించింది. ఈ శతాబ్దపు చివరి దశకంలో ఆకస్మిక సాంకేతిక [...]

విద్య ఒక ప్రాధమిక హక్కు

ప్రతి భారతీయ పౌరుడికి విద్య ఒక హక్కు. రాజ్యాంగం ప్రకారం విద్య మౌలిక స్థాయిలో ఉచితంగా లభించాలి. ప్రాథమిక విద్య అందరికీ నిర్బంధం. ఉన్నత విద్య అందరికీ తమ ప్రతిభ మీద ఆధారపడి అందుబాటులో ఉండాలి. మనిషి తన తెలివి తేటల్ని పూర్తిగా అభివృద్ధి చేసుకోడానికి వీలుగా విద్యాభ్యాసం కొనసాగిస్తు వుండాలి. అప్పుడే ఆ మనిషికి మౌలికమైన స్వేచ్ఛ లభిస్తుంది. మానవ హక్కు సంప్రదిస్తుంది. తమ పిల్లలకు ఎటువంటి విద్యను సమకూర్చాలనేది తలిదండ్రులే నిర్ణయించుకునే హక్కు వారికే [...]

రాష్ట్రానికి టాటాలు వస్తే సంతోషమే : రాఘవులు

హైదరాబాద్‌ : రాష్ట్రానికి టాటాల ప్రాజెక్టు వస్తే సంతోషిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. అయితే ప్రభుత్వ శక్తిసామర్థ్యాలపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు బెంగాల్‌లో పారిశ్రామిక అశాంతి నెలకొందన్న వార్తలను ఆయన ఖండించారు.

Follow

Get every new post delivered to your Inbox.